
మాఘ పౌర్ణమి సముద్ర స్నానాలకు ఏర్పాట్లుచేయాలని
అనకాపల్లి
జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ ఆదేశించారు….
ఈ నెల 12వ తేదీన మాఘ పౌర్ణమి పండుగ పురస్కరించుకొని జిల్లాలో ప్రజలు పుణ్యస్నానాలు చేసే ప్రదేశాలలో ప్రజలకు అవరసమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మాఘ పౌర్ణమి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
“సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన బుధవారం మాఘ పౌర్ణమి పండుగ సంధర్బంగా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక మరియు తంతడి గ్రామాలు, పరవాడ మండలంలోని తిక్కవానిపాలెం గ్రామం మరియు ముత్యాలమ్మపాలెం గ్రామం, ఎస్. రాయవరం మండలంలోని రేవుపోలవరం గ్రామం, పాయకరావు పేట మండలంలోని పెంటకోట గ్రామం లలో పెద్ద సంఖ్యలో భక్తులు సముద్ర తీరాలలో పవిత్ర స్నానాలు చేస్తారని తెలిపారు.” ఈ కార్యక్రమంలో భక్తులకు ప్రమాదాలు జరుగకుండా రక్షణ ఏర్పాట్లు, మౌళిక సదుపాయలు, రవాణా, వైద్య సౌకర్యాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటుచేయాలని తెలిపారు. భక్తులు స్నానం చేసేటప్పుడు సముద్రంలోకి లోతుగా వెళ్లకుండా సముద్రంలో దాదాపు దూరం వరకు స్తంభాలతో ఫిషింగ్ నెట్ బారికేడ్లను ఏర్పాటు చేయాలని, మహిళలు తడి బట్టలు మార్చుకోవడానికి తాత్కాలిక షెడ్లు, సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
✓ ఈతగాళ్లకు నియమించాలని వారికి గుర్తింపు జాకెట్లు / డ్రెస్ కోడ్ అందించాలని, పోలీస్ రక్షణ మరియు పార్కింగ్, ట్రాఫిక్ క్లియరెన్స్ కు సిబ్బందిని నియమించాలని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నందున అవాంచనీయ సంఘటనలు జరుగకుండా సిబ్బంది అప్రమత్తతతో ఉండాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని, ప్రజలను అప్రమత్తం చేయడానికి సరైన ప్రకటనల కోసం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
- భక్తులకు తాగునీటి సౌకర్యం, ఆరోగ్య శాఖ ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పారిశుధ్య నిర్వహణకు పంచాయతీ సిబ్బందిని నియమించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించుటకు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. సంబంధిత మండలాల తహశీల్దార్లు, మండల అభివృద్ది అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, పర్యవేక్షణ, సమన్వయం కోసం బాధ్యులైన అధికారులను నియమించాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు.
జారీః– జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, అనకాపల్లి

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app