SAKSHITHA NEWS

పరిసరాల పరిశుభ్రతను పాటించండి: మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి

పరిసరాల పరిశుభ్రతను పాటించండని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈరోజు మున్సిపల్ పరిధి 2వ వార్డులో ఫ్రైడే, డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

చైర్మన్, కౌన్సిలర్, అధికారులు ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి కుండిలను, పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS