
తొగర్రాయి గ్రామంలో వసంత పంచమి సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం
అంగన్వాడి నాలుగో సెంటర్ అంగన్వాడి టీచర్ పత్తిపాటి సునీత
సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)
కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో అంగన్వాడీ 4వ సెంటర్లో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వసంత పంచమి చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టిన రోజు సందర్భంగా తొగర్రాయి గ్రామంలో అంగన్వాడి కేంద్రం 4 వ టీచర్ పత్తిపాటి సునీత ఆధ్వర్యంలో చిరంజీవులు బాలబోయిన తనుష్ తల్లిదండ్రులు శ్రీను జ్యోతి. జిల్లెల్ల చైతన్య శ్రీ హర్షన్ తల్లిదండ్రులు అశోక్, శ్వేత. దండిగాని అశ్వంత్ తల్లిదండ్రులు నాగరాజు, నాగమణి. ఈ కార్యక్రమంలో తల్లులు, వారి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ,అత్తలు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడి పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడి టీచర్ పత్తిపాటి సునీత, ఆయా కొండపల్లి బొందమ్మ వాళ్ల చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app