
మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు….ట్రాఫిక్ ఎస్సై మల్లేష్..
సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా) కోదాడ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మాసరోత్సవాల లో భాగంగా.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు. కోదాడ పట్టణంలో హుజూర్నగర్ రోడ్ లో వాహనదారులకు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన కల్పించి మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు లైసెన్సును రద్దు చేస్తామన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ తాము క్షేమంగా ఉండడంతో పాటు ఎదుటివారు కూడా క్షేమంగా ఉండే విధంగా నడుచుకోవాలన్నారు. రోడ్డు భద్రత మాసో త్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సమ్మద్ సిబ్బంది ఉన్నారు.
