SAKSHITHA NEWS

పెందుర్తి లో ప్రభుత్వ స్థలం ఆక్రమించిన నాయకులు పై,రెవెన్యూ అధికారులు తీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. సీపీఎం పార్టీ…

సాక్షిత : ప్రభుత్వ స్థలాలను బడా బాబులు అధికార పార్టీ నాయకుల అండదండలతో దర్జాగా ఆక్రమిస్తుంటే కల్లప్పగించి చోద్యం చూస్తున్నారని పెందుర్తి జోను సిపిఎం పార్టీ నేతలు బి రమని, బి. జగన్ రెవెన్యూ అధికారులు తీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తిలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి మండలం లో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని బడా బాబులు రాజకీయ నాయకులు దర్జాగా ఆక్రమిస్తున్నారన్నారు.

రెవెన్యూ అధికారులు వీళ్ళని వదిలేసి పేదవాళ్లపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని నిరాశ వ్యక్తం చేశారు. రెవిన్యూ అధికారులు పేదవాళ్ల జోలికొస్తే పేదల తరఫున సిపిఎం పార్టీ ప్రతిఘటించడం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకుడు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS