
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన దుండిగల్ పురపాలక సంఘం చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ గారు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ 27వ వార్డు తాండా-1 లో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బంజారా భవనము మరియు రూ.18 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సి.సి.రోడ్డును నిర్మాణ పనులకు శంకుస్థపన చేసిన పురపాలక సంఘం చైర్- పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ .. అనంతరం గాగిల్లాపూర్ గణేష్ నగర్ కాలనీలో రూ.23 లక్షల వ్యయంతో సిసి రోడ్ మరియు రూ.22 లక్షల వ్యయంతో అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులు శంకుస్థాపన చేశారు. దుండిగల్ తాండలో రూ.20 లక్షలు సీసీ రోడ్డు, గాగిలాపూర్ తాండా2 లో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, రూ. 35 లక్షల వ్యయంతో అంతర్గత డ్రైనేజీ, రూ.5 లక్షల వ్యయంతో మహిళా భవనం, రూ.5 లక్షలు వ్యయంతో గ్రేవీ యార్డ్ సుందరికరుణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేసామన్నారు. మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కాంట్రాక్టర్ ని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేసామన్నార్. గడిచిన ఐదు సంవత్సరాలలో మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి జరిగిందని ఈ అభివృద్ధికి సహకరించిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద , కౌన్సిలర్లు, కాలనీ అసోసియేషన్ సంఘాలు, ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి అనేది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మనం చేసిన పనిని ప్రజలు చిరస్థాయిగా గుర్తించుకుంటారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్ కోర్ర శంకర్ నాయక్, సీనియర్ నాయకులు కుంటి నాగరాజు, సుధాకర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మీబాయి, వార్డు ప్రెసిడెంట్ అమర్ సింగ్, సీనియర్ నాయకులు రవీందర్ నాయక్, జగన్ నాయక్, యాల్. శంకర్ నాయక్, భీమ్ సింగ్, వెంకటేష్ నాయక్, మోర అశోక్, ప్రేమ్ సింగ్, గడిల ప్రవీణ్, నరేందర్ నాయక్, ప్రవీణ్ నాయక్, సురేష్, సీతన్, నరేందర్ నాయక్, మోహన్ నాయక్, హనుమంతు నాయక్, రోషన్, ప్రసాద్, సోను, రాకేష్ నాయక్, రెడ్యా నాయక్, మహిళా నాయకురాలు శాంతాబాయి, లక్ష్మి, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app