
కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
సాక్షిత : ఈ నెల 27 వ తేదీన జరగనున్న శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో భాగంగా కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేయటం జరిగింది.పలు ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి,పట్టభద్రుల నియోజకవర్గ ఓటరుగా నమోదు కాబడిన పలువురు ఉద్యోగులను కలిసి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ప్రథమ ప్రాధాన్య ఓటును వేసి ,తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపవలసిందిగా కోరడం జరిగింది.ప్రచారంలో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, భీమవరపు సుబ్బారావు,పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, కార్యదర్శి మద్దుమాల రవి, కందుల రమణ, మురకొండ మల్లిబాబు, మక్కెన నరసింహా రావు, అజహర్, తుబాటి శ్రీహరి, గుర్రం నాగ పూర్ణచంద్రరావు,మిరియాల రత్న కుమారి, అమరా రమాదేవి, కనికరం తదితరులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app