కేసిఆర్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి

Spread the love

కేసిఆర్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి

హస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
సాక్షిత సైదాపూర్ హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లా

హస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండల పరిధిలోని గాంధీ నగర్ గ్రామంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని హస్నాబాద్ శాసనసభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామలలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మరుగు దొడ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని ప్రతి గ్రామ అభివృద్ధికి నెల నెల ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు ఎంతో వెనుకబాటులో ఉండేవని,స్వరాష్టం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ లక్ష్యం గా సాగుతున్న కేసీఆర్ పాలనలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి ని సాధిస్తున్నాయని, నాటి సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఎంతో వెనుకబాటుకు గురయ్యామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలని, ప్రజలంతా కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page