
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఅర్ఎస్ నేతలతో కేసీఅర్ సమావేశం. ఆ విషయంలో దిశానిర్దేశం..!!
ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఅర్ఎస్ నేతలతో కేసీఅర్ సమావేశం అయ్యారు. సహావేశానికి కేటీఆర్, హరీష్, కవిత, పద్మారావు హాజరయ్యారు. నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివవాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగసభకు కేసీఆర్ ప్లాన్ చేశారు. ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో BRS ప్రతినిధుల సమావేశం ఉంటుంది. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్‌లో బహిరంగ సభకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.
ఇక చాలా రోజుల తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేసారని అధికార పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈనెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్ అధినేత పాల్గొంటారని గులాబీ వర్గాలంటున్నాయి. SLBC, కాళేశ్వరం, అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ కాంగ్రెస్ నేతలు సవాల్ చేయడం.. మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం.. అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా మూడుసార్లు మాత్రమే తెలంగాణ భవన్‌లో సమావేశాలు నిర్వహించారు. రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలోప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్. పార్టీ ఆవిర్భావించి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app