SAKSHITHA NEWS

కట్ట మైసమ్మ జాతరను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

సూరారం కట్ట మైసమ్మ దేవాలయం వద్ద అత్యంత వైభవోపేతంగా ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఐదు రోజులపాటు నిర్వహించనున్న “శ్రీశ్రీశ్రీ కట్టమైసమ్మ తల్లి & రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర” ను విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆలయ కమిటీ సభ్యులు & వివిధ విభాగాల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద మాట్లాడుతూ… కట్ట మైసమ్మ అమ్మవారి జాతరకు ప్రతి యేట లక్షలాదిమంది భక్తులు తరలి వస్తారు. నీటి సదుపాయం, ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు, సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు, ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంపు వంటి ఏర్పాట్లను అన్ని విభాగాల అధికారులు ఆలయ కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. అదేవిధంగా జాతరలో పోకిరిల బెడద లేకుండా షీ టీమ్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం బోనాల జాతర వాల్ పోస్టర్ ను, కరపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ, జిహెచ్ఎంసి ఉప కమిషనర్ మల్లారెడ్డి, సీఐ భరత్ కుమార్, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ జీఎం అశోక్, ఈఈ క్రిష్టప్ప, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మన్నె బాలేష్, సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు వీరారెడ్డి, ప్రసాద్, మల్లేష్, దారం సాయి, కృష్ణారెడ్డి, ఈ. సురేష్, ఇంద్రసేన, సాయి గౌడ్, మహేష్ కుమార్, శివరాజ్, వెంకటేష్, లక్ష్మారెడ్డి, గోపాల్ మరియు డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app