SAKSHITHA NEWS

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని పా కటాక్షాలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

126 – జగద్గిరిగుట్ట డివిజన్ కొండపై భక్తులచే పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దయతో ప్రజలంతా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలి. అనంతరం గరుడ వాహనంపై నిర్వహించిన స్వామి వారి పల్లకి సేవలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, నాయకులు బాబుగౌడ్, శశిధర్, జైహింద్, మెట్ల శీను, బండ మహేందర్, అంజనేయులు యాదవ్, వెంకటేష్, దాసు, సుధాకర్, జయకృష్ణ, మహేష్, విఠల్, పాపిరెడ్డి, అజం తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app