SAKSHITHA NEWS

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు.

 ఐ.డి.ఓ.సిలోని తమ ఛాంబర్‌ నందు ఎం.ఏ.ఎల్‌.డీ. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో  తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ జాబ్ డ్రైవ్ గోడపత్రికను  జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని సూచిస్తూ, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. న్యూలాండ్ లాబొరేటరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో జనవరి 30 వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వర్చ్యువల్ క్లాస్ రూమ్ లో జాబ్‌ డ్రైవ్ నిర్వహిస్తారని తెలిపారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఈ జాబ్ మేళాలో 18 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఇంటర్మీడియట్ (MPC & BiPC),  2022, 2023, 2024 డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఫెయిల్,  2021, 2022, 2023, 2024 B.Sc. కెమిస్ట్రీ పాసైన వారు మరియు 2025 ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులు అని తెలిపారు. అభ్యర్థులకు తెలుగు భాషలో ప్రావీణ్యం, ఇంగ్లీష్‌పై ప్రాథమిక అవగాహన అవసరమని అన్నారు.ఎంపికైన అభ్యర్థులకు వార్షిక వేతనం రూ.2,00,000/- ఉంటుందని, అదనంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉన్నత విద్యకు ప్రత్యేక సహాయం, ఉచిత రవాణా సౌకర్యం, సబ్సిడీ క్యాంటీన్ భోజనం, రాత్రి షిఫ్ట్ అలవెన్స్ వంటి ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపారు. అర్హతలు కలిగిన ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు కళాశాల ప్రిన్సిపాల్ షేక్ కాలందర్ భాషా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ రాధిక, కళాశాల టీఎస్‌కేసీ సమన్వయకర్త సత్తెమ్మ  తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app