
జయలక్ష్మికి కలెక్టర్ ప్రశంసా పత్రం…
గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలలో మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీలో హెల్త్ సూపర్వైజర్ గా పని చేస్తున్న వెలగపూడి జయలక్ష్మికి అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చేతుల మీదగా జయలక్ష్మి ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష, హెల్త్ సూపర్వైజర్ జయలక్ష్మి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. భవిష్యత్తులో జయలక్ష్మి ఉన్నతాధికారులచే మరిన్ని ప్రశంసలు అందుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app