వచ్చే ఏడాది నుంచి పాఠ్య పుస్తకాల్లో జయ జయహే తెలంగాణ గీతం
హైదరాబాద్:
జయ జయహే తెలంగాణ” గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం చేసుకుంది, మన రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం తో పాటు తెలంగాణ తల్లి ఫోటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రిం చాలని, రేవంత్ సర్కార్ నిర్ణయించింది,
వచ్చే ఏడాది ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో కనిపించనున్నా యి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతో పాటు జాతీయ గీతాలు ఉన్నాయి…
ఇక వచ్చే ఏడాది విద్యార్థు లకు పాత సిలబస్సే ఉంటుందని, 2026-27 లో సిలబస్ మారే అవకాశం ఉందని, స్కూల్ ఎడ్యుకే షన్ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు.