0 0
Spread the love

Read Time:2 Minute, 35 Second
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా //
అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో సమ్మె విజయవంతం
యాంకర్ వాయిస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్నంలో జాతీయ వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్స్ పోర్టు కార్మికుల సమ్మె విజయవంతమైందని అఖిలపక్ష నాయకులు తెలిపారు.అఖిలపక్ష కార్మిక సంఘాలు ఐ ఎఫ్ టి యు, ఏ ఐ టి యు సి, సి ఐ టి యు నాయకులు కార్యకర్తలు జండాలు చేతబట్టి నరసరావుపేట పాత ఎంపీడీవో కార్యాలయం నుండి రింగ్ రోడ్డు బస్టాండ్ మీదుగా సంత మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
వాయిస్ ఓవర్ :
ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తు కార్మిక హక్కులు కాలరాస్తున్నాయని, మోటార్ వాహనదారులకు అక్రమంగా చలానాలు విధిస్తూ, ఆలస్యంగా పిలుస్తున్నారని కొంత రోజుకి 50 రూపాయల పెనాల్టీ విధిస్తూ మోటారు కార్ మేకింగ్ ఇబ్బందులపాలు చేస్తున్నారని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, ప్రభుత్వాలు వెంటనే కార్మిక హక్కులు కాలరాసే చట్టాలను సవరించి మోటారు కార్మికులు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పందా నాయకులు గోకినేపల్లి ప్రభాకర్, సిపిఐ నాయకులు సయ్యద్ సలీం, సిఐటియు నాయకులు పిట్టల అర్జున్, నాయకులు రఫీ, మున్నా, శ్రీను, తిర్నాటి సత్యనారాయణ, గన్నే రామకృష్ణ,అనిల్, సజ్జారపు శ్రీను, జల్లిపల్లి దేవరాజు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Print Friendly, PDF & Email

Spread the love

You cannot copy content of this page