
కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జారీ
మార్గదర్శకాలను ఖరారు చేసిన సర్కారు
” క్షేత్రస్థాయి పరిశీలనకు ముసాయిదా
- గ్రామసభలో ప్రదర్శించిన తర్వాత ఆమోదం
- సభ్యుల మార్పులు, చేర్పులకు అవకాశం రేషన్ కార్డుల జారీ అనేది నిరంతరం ప్రక్రియ ఈ చక్కటి సదవకాశం ను సద్వినియోగం చేసుకోవాలి గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు అమలు కై ఈ నెల 16 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు జరిగే అర్హుల ఎంపిక సర్వే కార్యక్రమంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జన్మభూమి కాలనీ లో జరుగుతున్న సర్వే కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి పాల్గొని సర్వే జరుతున్న తీరు ను పరిశీలించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని, ఎలాంటి తారతమ్యాలు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని , ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందేలా అధికారులు కృషి చేయాలని, నిజమైన లబ్ధిదారులందరికి న్యాయం జరుగుతుందని, సర్వే కోసం వచ్చినా అధికారుల బృందానికి వాస్తవాలు చెబుతూ అన్ని వివరాలను అందించాలని, తప్పుడు సమాచారం ఇవ్వకూడదని , ఈ నెల 16 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు అధికారుల బృందాలు పర్యటించి అర్హులను గుర్తిస్తాయి అన్నారు. ఈ చక్కటి సదవకాశం ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు .
పేదవారు కన్న కల ఇందిరమ్మ ఇల్లు అని,పేదవారికి భారం కాకుండా ప్రభుత్వం అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. పేదవారి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది అని,ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫోటో తీసి యాప్ లో నమోదు చేస్తారు అని , ఈ చక్కటి అవకాశం ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తారూ,ఎవరు ఇళ్లు వారే నిర్మించుకునే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని, ప్రజాపాలన లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తిస్తున్నారు అని PAC చైర్మన్ గాంధీ తెలియ చేసారు.ప్రజాపాలన లో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని, ఒకవేళ దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అని PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు.
అర్హులైన ,నిజమైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందుతాయి అని ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది అని , గ్రామ, మున్సిపల్ స్థాయిలో సభలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జాబితాలను సిద్ధం చేస్తారు అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
: కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వినతులను పరిష్కరించేందుకు విధివిధానాలను ఖరారు చేసింది. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది.
ఈనెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తా మని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇందుకు అను గుణంగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మంత్రి వర్గం ఉపసంఘం సిఫార్సులకు అనుగు ణంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముసాయిదా జాబితాను పంపించి గ్రామసభలు, మునిసిపల్ వార్డులు, కార్పొ ‘రేషన్ డివిజన్లలో జాబితా ప్రదర్శించిన తర్వాత ఆమోదించనుంది. ఈ మేరకు పౌర సరఫరాలశాఖ కమిషనర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క రేషన్ కార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే రేషన్ కార్డులో సభ్యుల మార్పులు, చేర్చులు, తొలగింపులకు అవకాశం కల్పించారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు..
- కులగణన సర్వే ఆధారంగా.. తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనరు క్షేత్రస్థాయి. పరిశీలనకు పంపిస్తారు.
- ముసాయిదా జాబితాను గ్రామసభ, మున్సిపా లిటీ వార్డుల్లో ప్రదర్శించి, చదివి వినిపించి, చర్చించిన తర్వాత ఆమోదిస్తారు.
- మండల స్థాయిలో ఎంపీడీవో, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కమిషనర్లు ఈ పక్రియకు బాధ్య లుగా వ్యవహరిస్తారు.
జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డీసీ ఎస్ వో (జిల్లా పౌరసరఫరాల అధికారి) పర్యవేక్ష కులుగా ఉంటారు.
- గ్రామ, వార్డు సభల్లో ఆమోదించిన లబ్దిదారులు అర్హత జాబితాను మండల/మునిసిపల్ స్థాయి లో ఇచ్చిన లాగిన్లో నమోదు చేసి జిల్లా కలెక్ట ర్/జీహెచ్ఎంసీ కమిషనర్ లాగిన్ కు పంపాలి.
- పంపిన జాబితాను జిల్లా కలెక్టర్/జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే పౌరసర ఫరాలశాఖ కమిషనర్ లాగినక్కు పంపించాలి.
- ఈ తుది జాబితా ప్రకారం పౌరసరఫరాలశా కమిషనర్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ఎ.ఎం.సి కె.శ్రీనివాస్, ఎఇ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, సి.ఓ ముస్తఫా మరియు నాయకులు పాండుగౌడ్, జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, రవీందర్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
