బిస్కెట్ కంపెనీలో ఇంత దారుణమా..?

Spread the love

Is it so bad in the biscuit company..?

కంపెనీ మేనేజర్ మల్లికార్జున్, కాంట్రాక్టర్ సాధు వెంకట్ రెడ్డి పైన తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టండి

బిస్కెట్ కంపెనీలో ఇంత దారుణమా..?

కార్మిక చట్టాల యదేచ్ఛగా ఉల్లంఘన
బిజెపి రాష్ట్ర నాయకులు నెల్లి వర్ధన్ రెడ్డి ఆందోళన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో*
రంగా రెడ్డి జిల్లా సాక్షిత

తిరుమలేష్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ రాస్తారోకో

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం చౌదర్ గూడా మండలంలో ఏర్పాటు చేసిన బ్రిటానియా గుడ్ డే బిస్కెట్ కంపెనీలో అత్యంత దారుణాలు చోటుచేసుకుంటున్నాయని వాటి ఫలితమే కాంట్రాక్టు కార్మికుడు తిరుమలేష్ ఆత్మహత్యాయత్నం చేయడం దీనికి నిదర్శనమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

బిస్కెట్ కంపెనీ ముందు బిజెపి ఆధ్వర్యంలో శ్రీవర్ధన్ రెడ్డి, కమ్మరి భూపాలా చారి, అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, కోనేరు శ్రీనివాస్, లక్ష్మీకాంత్ రెడ్డి, కక్కునూరి వెంకటేష్ గుప్తా, ఆకుల ప్రదీప్ తదితరులు పెద్ద ఎత్తున కంపెనీ ముందు మొహరించారు.

ఈ సందర్భంగా కంపెనీ ముందు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కంపెనీ యాజమాన్య తీరుపై ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ సందర్భంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీలో మహిళలు విధుల్లో చేరుతున్నప్పుడు పూస్తే మెట్టెలు తీయించి అత్యంత దారుణంగా కంపెనీలోకి తీసుకుంటారని విచారం వ్యక్తం చేశారు.

తిరుమలేష్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందజేయాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న 12 గంటల పని దినాన్ని మార్చి చట్టప్రకారం ఎనిమిది గంటలకు కుదించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మిక చట్ట ప్రకారం పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే వేతనంతో కూడిన వారాంతపు సెలవు ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. గతంలో యాజమాన్య వేధింపుల కారణంగా బలైన కార్మికులకు వెంటనే న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

తిరుమలేష్ ఆత్మహత్యాయత్నానికి యాజమాన్యం కారణమని ముందు వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని శ్రీవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కంపెనీ మేనేజర్ మల్లికార్జున్, కాంట్రాక్టర్ సాధు వెంకట్రెడ్డి పైన తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు..

Related Posts

You cannot copy content of this page