అంతర రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.

Spread the love

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ

అంతర రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.

వారి వద్ద నుండి 580 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రెండు ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం విలువ సుమారుగా 34 లక్షలు స్వాదీనం.
ఎన్.టి.ఆర్ జిల్లా నందు జరుగుతున్న దొంగతనాలు మరియు చైన్ స్నాచింగ్ లను నివారించడంలో ప్రత్యేక దృష్టి సారించి నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని నగర పోలిస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.,గారి ఆదేశాల మేరకు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిదిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ క్రమంలో నందిగామ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కువ చైన్ స్నాచింగ్ లు జరుగుతున్నట్లు వచ్చిన పిర్యాదుల నేపధ్యంలో రూరల్ డి.సి.పి. మేరి ప్రశాంతి ఐ.పి.ఎస్ సూచనలతో నందిగామ ఏ.సి.పి జి.నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.సతీష్, నందిగామ ఎస్.ఐ.లు పి.సురేష్, ఎం. పండుదొర వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నందిగామ చుట్టుప్రక్కల ప్రాంతాలలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నేపధ్యంలో ఈ రోజు ది:15.03.2023 తేదీన సాయంత్రం నందిగామ పోలీస్ ప్రత్యేక బృందాలకు రాబడిన పక్క సమాచారం మేరకు నందిగామ గ్రామ శివారులో NH-65 రోడ్డు లో Y జంక్షన్ వద్ద నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి మొత్తం సుమారు 34 లక్షల విలువైన 580 గ్రాముల బంగారు ఆభరణాలు (చోరీ సొత్తు)ను మరియు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.

నిందితుల వివరాలు:

  1. తెలంగాణా, ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలంకు చెందిన గొర్రె శ్రీనివాస్ @ శ్రీను (22 సం.)
  2. తెలంగాణా, ఖమ్మం జిల్లా, అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు @ వెంకటేష్@ నాని, ( 26 సం.)
  3. తెలంగాణా, ఖమ్మం జిల్లా, సుక్రవరపుపేటకు చెందిన కొనగాళ్ళ గణేష్ (19 సం.)
  4. తెలంగాణా, భద్రాద్రికొత్తగూడెం జిల్లా, భద్రాచలంకు చెందిన దేవనబోయిన మహేష్ @ బాతు ( 26 సం.)

వివరాల్లోకివెళితే….
గొర్రె శ్రీనివాస్ @ శ్రీను ఏడవ తరగతి వరకు చదువుకుని తరువాత క్యాటరింగ్ పనులు చేసుకుంటూ ఉండేవాడు ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి సంపాదించిన డబ్బులు జల్సాలకు సరిపోక ఏవిధంగానైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో, తన సమీప బంధువైన చల్లా వెంకటేశ్వర్లు తో కలిసి రాత్రి సమయంలో తాళం వేసి వున్న ఇంటిలో దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకున్నారు. అనంతరం వీరు ఇద్దరు అతి సులువుగా డబ్బులు సంపాదించడానికి ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని వెంబడించి వారి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కుపోయి (చైన్ స్నాచింగ్) వాటిని అమ్ముకుని జల్సాలు చేద్దాం అని నిర్ణయించుకుని వీరి సమీప బంధువులు అయిన కొనగాళ్ళ గణేష్ మరియు దేవనబోయిన మహేష్ లకు పూర్తి వివరాలను తెలియజేసి అందరూ కలిసి జల్సాలను చేయడానికి చైన్ స్నాచింగ్ లు చేయాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్నదే తడవుగా 2022 అక్టోబర్ నెలలో శ్రీనివాస్ మరియు వెంకటేష్ లు బైక్ పై వెళుతున్న సమయంలో ఖమ్మం జిల్లా బూర్గం పాడు సమీపంలో ఒంటరిగా వున్న మహిళను గమనించి దగ్గరగా వెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని వెళ్ళిపొయినారు. ఈ విధంగా వీరు మరియు వీరి బంధువులయిన గణేష్ మరియు మహేష్ లతో కలిసి ఆరు నెలల కాలంలో ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రంలలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధులలో ఒంటరిగా వున్న మహిళల మెడలలో మొత్తం 16 చైన్ స్నాచింగ్ లు చేసినారు.

సదరు స్నాచింగ్ చేసిన కొన్ని బంగారు ఆభరణాలను వేరు వేరు ప్రదేశాలలో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. వీరు ఈ రోజు వారి వద్ద వున్న బంగారు ఆభరణాలను విజయవాడ లో అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేద్దాం అన్న ఉద్దేశంతో వారి యొక్క రెండూ ద్విచక్ర వాహనాల పై బయలు దేరి వచ్చిన సమయంలో నందిగామ టౌన్ పోలీస్ వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు నందిగామ గ్రామ శివారులో NH-65 రోడ్డు లో Y జంక్షన్ వద్ద నలుగురుని అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 580 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రెండు ద్విచక్ర వాహనాలు మొత్తం సుమారు 34 లక్షల విలువైన చోరీ స్తోత్తును స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.

చైన్ స్నాచింగ్ చేసిన నిందుతులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈ క్రింది సిబ్బందిని నగర పోలిస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., అభినందించి, రివార్డులు ఇచ్చి సత్కరించడమైనది.
నందిగామ ఏ.సి.పి జి.నాగేశ్వర రెడ్డి ,
నందిగామ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.సతీష్,
నందిగామ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.-1 పి.సురేష్,
నందిగామ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.-2 ఎం. పండుదొర,
నందిగామ పోలిస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.తిరుపతిరావు,
నందిగామ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎన్. సంతోష్,
నందిగామ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బి.పూర్ణచంద్ర రావు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page