
ప్రభుత్వ సిటీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవనీ పురస్కరించుకొని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్ అధ్యక్షతన సిటీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శుక్ల చే మహిళా దినోత్సవ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. సిటీ కళాశాల మహిళా ప్రొఫెసర్ల అందరిని ఈ ఉత్సవ కార్యక్రమంలో ఉత్సవంతంగా పాల్గొనాలని కృష్ణ యాదవ్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రెండు రోజులు జరిగే మహిళా ఉత్సవ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలని కృష్ణ యాదవ్ పేర్కొన్నారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ప్రభుత్వ పెద్దలు ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారని మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. సీనియర్ ప్రొఫెసర్లు అవధానం సుజాత, శాంతి, సుదక్షణ, రజిత, కమల సుధారాణి, రమాదేవి తదితర మహిళ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app