SAKSHITHA NEWS

మార్షల్ ఆర్ట్స్ విభాగంలో “ఇంటర్నేషనల్ రైజింగ్ స్టార్ మార్షల్ ఆర్ట్స్ 2025” లో సత్తాచాటిన చిన్నారి తేజశ్రీ , ఖుషీ శర్మలను అభినందించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

*జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్ విభాగం నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన బ్రిలియంట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ స్టూడెంట్ “చిన్నారి తేజశ్రీ & ఖుషీ శర్మ” లు ఇటీవల బిర్లా ప్లానిటోరియం నందు కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో “ఇంటర్నేషనల్ రైజింగ్ స్టార్ మార్షల్ ఆర్ట్స్ 2025” అవార్డుతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో “ఇంటర్నేషనల్ రైజింగ్ స్టార్ మార్షల్ ఆర్ట్స్ 2025” అవార్డు గ్రహీత చిన్నారి తేజశ్రీ, ఖుషీ శర్మలు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ చిన్నారి తేజశ్రీ ని అభినందిస్తూ రానున్న రోజుల్లో ఉత్తమ ప్రతిభతో మరిన్ని అవార్డులు సాధించి కన్న తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు మంచి పేరును తేవాలన్నారు.

ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు దేవేందర్ గౌడ్, కుత్బుల్లాపూర్ కేబుల్ టీవీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ ప్రెసిడెంట్ టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా మెంబర్, C2 తెలంగాణ జర్నలిస్ట్ దుర్గారావు, టి యుడబ్ల్యూజే, ఐజేయు ప్రెస్ క్లబ్ మెంబర్, విజన్ ఆంధ్ర జర్నలిస్ట్ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app