SAKSHITHA NEWS

ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షలను పకడ్బంధికారి నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన…………….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లా
ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
మార్చి, 5 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనుండగా మార్చి, 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. వనపర్తి జిల్లాలో ఈ సారి 12150 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 6457 మంది ఉండగా ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు 5693 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.

  మార్చి, 21 నుంచి జరిగే  10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి.  వనపర్తి జిల్లాలో మొత్తం  6887 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6853 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 34 మంది ఒకసారి ఫెయిల్ అయినవారు కంపార్ట్మెంట్ పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
 ఈనేపథ్యంలో  సోమవారం మధ్యాహ్నం కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలక్టర్ అధ్యక్షతన సంబంధిత జిల్లా అధికారులతో పరీక్షల నిర్వహణ పై సమన్వయ సమావేశం నిర్వహించారు.
    ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ పరీక్షలను  ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.  పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడమే కాకుండా ఎలాంటి మాల్ప్రాక్టిస్ జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ శాఖ ద్వారా పరీక్షలు జరిగేటప్పుడు  144 సెక్షన్ అమలు చేయడం, జీరాక్స్ కేంద్రాలు మూసి ఉంచటం, ప్రశ్నా పత్రాల తరలింపులో ఎస్కార్ట్ ఇవ్వడం,   ఫ్లయింగ్ స్క్వాడ్ కు ఎస్కార్ట్ ఇవ్వడం వంటి చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని  ఆదేశించారు.  పరీక్షా కేంద్రాలను  శుభ్రంగా ఉంచటం, తాగు నీరు సౌకర్యం కల్పించాలని, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు.
   విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా పరీక్షా కేంద్రాల రూట్లలో బస్సులు సకాలంలో నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.  పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
   అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ (ఇన్చార్జి) యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య, డిస్పి కే. ఉమామహేశ్వర రావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app