SAKSHITHA NEWS

ఏపీలో గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు.. దరఖాస్తులు ప్రారంభం

సాక్షిత : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26కు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి. మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. బాలురకు 1,340, బాలికలకు 1,340 సీట్లు భర్తీ చేస్తారు. టెన్త్ పాసైన, ఈ ఏడాది పరీక్షలు రాయబోతున్నవారు అర్హులు. 31-8-2025 నాటికి వయసు 17 ఏళ్లకు మించరాదు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండాలి. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app