
తెలంగాణలోని అమాయక ప్రజలను 420 బూటకపు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికీ 420 రోజులు పూర్తయినందున ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఈ పాలకులకు బుద్ధిని ప్రసాదించు మహాత్మ అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గార్ల ఆదేశాల మేరకు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజీవ్ గృహకల్ప లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేత కార్యక్రమానికి మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ , మాజీ కార్పొరేటర్లు రఘూవేంద్ర రావు,మాజీ కో ఆప్షన్ సభ్యలు చంద్రగిరి జ్యోతి సతీష్, మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అధికారమే లక్ష్యంగా, ప్రజలు ఏమైపోతే మాకేంటి అనే రీతిలో అమలుకు సాధ్యం కానీ హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.కానీ నేడు ఈ కాంగ్రెస్ పాలకులు మాత్రం గ్రామసభలు, వార్డు సభల పేరుతో నానా హైరాన చేస్తూ జాబితాలను ప్రకటిస్తూ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అసలు వాళ్లు వెల్లడించే జాబితా అర్హుల జాబితానా…? దరఖాస్తుదారుల జాబితానా…? అనేది వారికే స్పష్టం లేదు. సంక్షేమ పథకాల విషయంలో మంత్రుల మాట ఎవరికి వారే… యమునా తీరే అన్నట్టుగా తయారైంది. ఈ కార్యక్రమంలో నాయకులు మంజునాథ్, కుమార్ రెడ్డి, ముత్యాలు, బిక్షపతి, జస్వంత్, మేకల మధుసూదన్, సండ్ర వెంకటేష్,అజయ్ చౌదరి, మహిళా నాయకులు నర్మదా, స్వర్ణ కుమారి, సుకన్య,యువ నాయకులు ఆనంద్ రెడ్డి, ఎన్ఎంసి యువజన విభాక్షణ అధ్యక్షులు ప్రవీణ్, నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app