
స్టార్ చిల్డ్రన్ హైస్కూల్, పాల్వంచ
భౌతిక శాస్త్రంలో భారతీయ దృవతార సి.వి.రామన్
పాల్వంచ : స్థానిక మార్కెట్ ఏరియాలో గల స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవంను ఘనంగా నిర్వహించినారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి శ్రీనివాస్ రెడ్డి, సైన్స్ అధ్యాపకులు జి.స్వరూప రాణి, ఎస్.ప్రశాంతి మాట్లాడుతూ సి వి రామన్ భౌతిక శాస్త్రంలో చేసిన సేవలను కొనియాడారు. ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని ఊహించలేమని, ఆసియా ఖండంలోనే తొలిసారి భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతి పొంది, భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన సి వి రామన్ భారతీయుడు కావడం మనందరికి గర్వకారణం అని పేర్కొన్నారు.
అనంతరం కరస్పాండెంట్ జి భాస్కరరావు మాట్లాడుతూ వైజ్ఞానిక రంగంలో ఎవరూ చేయని సాహసాలను విజయవంతంగా చేసి అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని రెప రెప లాడించిన ధ్రువతార సి వి రామన్ అని పేర్కొన్నారు. అనంతరం సైన్స్ అధ్యాపకులను ఘనంగా సన్మానించినారు.విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనలు వారి యొక్క మేధో సంపత్తిని మరియు సృజనాత్మకతను కనబరిచినవి . ఈ కార్యక్రమంలో ఝాన్సీ, గీత, మహేశ్వరి, సత్య ప్రసాద్, స్వాతి, శ్వేత, లక్ష్మి, సుల్తానా మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app