సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుండి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్ శాఖ అధికారులు, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకలలో విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసే విధంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆగస్టు 15 వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా విద్యార్ధులు అందరికీ మహాత్మాగాంధీ చరిత్రను తెలియజెప్పే, విద్యార్ధి దశ నుండే దేశభక్తి ని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన చిత్రాన్ని రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్ద్యంతో ఉన్న 563 స్క్రీన్స్ లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విద్యార్ధులను థియేటర్ లకు తీసుకెళ్ళే రవాణాఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేపడుతుందని, అంతేకాకుండా వారికి ఉచితంగా వాటర్ బాటిల్స్, స్నాక్స్ అందించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులతో ఒక సమావేశం నిర్వహించి సమీక్షించాలని హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రావిగుప్తా ను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సునీల్ నారంగ్, కార్యదర్శులు అనుపమ్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు బసిరెడ్డి, FDC ED కిషోర్ బాబు, UFO, క్యూబ్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Related Posts
Spread the love లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిస్తే మోడీ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారని కేసీఆర్ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ 15 ఏళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, తెలంగాణలో బీజేపీ…
Spread the love అలంపూర్ జోగులాంబ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Spread the love శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో హనుమాన్ జయంతి సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్నఆంజనేయుడి ఆలయంలో గుడి చైర్మన్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం…
Spread the love ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత నెల్లూరు డివిజన్ “భారతీయ జీవిత భీమా ఏజెంట్ల సమాఖ్య” (లియాఫీ) జనరల్ బాడీ మీటింగ్ అంగ రంగ వైభవం గా, అంబరాన్ని తాకే విధముగా ఈనెల 26 న జరుగుతుంది…
Spread the love ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వడదెబ్బ తగలకుండా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!వేసవి కాలం మొదట్లోనే.. ఎండలు మండిపోతున్నాయి. ఇక రాబోయే రోజుల గురించి ఆలోచిస్తేనే.. చెమటలు పట్టేస్తున్నాయి. వేసవికాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య.. వడదెబ్బ.…
Spread the love దుబ్బాక మండలంలోని గంభీర్ పుర్ గ్రామానికి చెందిన భీమాసేన తండ్రి కరికే రాజయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్ తుడం ప్రశాంత్,లుపరామర్శించారు.రాజయ్య చిత్ర పటానికి…
Spread the love ఆలయ మర్యాదలతో నామ అర్చకులు స్వాగతం , ప్రత్యేక పూజలునామ అర్చకుల ఆశీర్వచనాలు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఉదయం…
Spread the love మోండా మార్కెట్ టకార బస్తీ లోని అశోక యువజన సంఘం మంగళవారం నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు, బీ.ఆర్.ఎస్. ఎం పీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామూహికంగా…
Spread the love హనుమాన్ జయంతి సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి జగద్గిరిగుట్ట, దేవేందర్ నగర్, శ్రీనివాస్ నగర్,ఎన్.టి.ఆర్ నగర్,ఐ.డి.పి.ఎల్ గుడెన్ మెట్ ,ద్వారకా నగర్,సుదర్శన్ రెడ్డి నగర్, పద్మా నగర్ లో ఆంజనేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి,…
Spread the love మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే అలంపూర్ నియోజకవర్గం లోని నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అల్లంపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి…