SAKSHITHA NEWS

ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా మీ మీ వ్యాపారాలు నిర్వహించుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఫుట్ పాత్ లపై వ్యాపారులను తొలగిస్తున్న నేపథ్యంలో నిరుపేదలైన ఫుట్ పాత్ వ్యాపారులు రెండు రోజుల క్రితం MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ బాధలను విన్నవించి తమను ఆదుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నార్త్ జోన్ GHMC కమిషనర్, ట్రాఫిక్ ACP, ఇతర అధికారులతో సమావేశమై ఫుట్ పాత్ వ్యాపారులలో అధికశాతం మంది నిరుపేదలని, వారి ఉపాధిని దూరంచేసి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని వివరించారు. మానవతాదృక్పదంతో వ్యవహరించాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు చేసుకునే విధంగా క్షేత్రస్థాయిలో కి వెళ్ళి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. దీంతో గురువారం GHMC DC సమ్మయ్య, ట్రాఫిక్ ACP శంకర్ రాజు, ఇతర అధికారులతో కలిసి మోండా డివిజన్ పాలికా బజార్ చౌరస్తా, మోండా మార్కెట్, రాంగోపాల్ పేట డివిజన్ లోని అంజలి టాకీస్ దర్గా, PG రోడ్, మినిస్టర్ రోడ్, బేగంపేట డివిజన్ లోని జవహర్ జనతా, ఓల్డ్ కష్టమ్ బస్తీ ప్రాంతాలలో పర్యటించి ఫుట్ పాత్ వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ఉద్దేశపూర్వకంగా వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయరని, కొందరు రోడ్లపై ఇష్టానుసారంగా వ్యాపారాలు చేసుకుంటూ వాహనదారులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కల్పించకుండా తమ వ్యాపారాలను చేసుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదని అన్నారు. అధికారులకు సహకరించాలని చెప్పారు. ఫుట్ పాత్ వ్యాపారుల నుండి కొందరు రోజువారి అద్దెలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎవరికి అద్దెలు చెల్లించవద్దని అన్నారు. త్వరలోనే ఫుట్ పాత్ వ్యాపారులకు ఫోటో తో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ టి. మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, టౌన్ ప్లానింగ్ ACP సుష్మిత, BRS పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, కిషోర్, శ్రీహరి, రాములు, ఆంజనేయులు, శేఖర్, మహేష్ యాదవ్, ఆరీఫ్, ఆరీఫ్ తదితరులు ఉన్నారు.