టిడ్కోగృహ సముదాయంలో
మున్సిపల్ ప్రాధమిక ఆరోగ్య సెంటర్ ను ఏర్పాటు చేయాలి.
రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు.
చిలకలూరిపేట: టిడ్కొ గృహాల సముదాయం లో మున్సిపల్ ప్రాధమిక ఆరోగ్య సెంటర్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్స్, నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు అన్నారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
పట్టణంలో పేదల కోసం నిర్మించిన టిడ్కోగృహ సముదాయంలో వేలమంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. అక్కడ నివసించే ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి అందరికీ ఉండదు కాబట్టి మున్సిపల్ ప్రాధమిక ఆసుపత్రి ఏర్పాటు చేసి 24 గంటలు సర్వీస్ ఇవ్వాలని కొండ్రముట్ల నాగేశ్వరరావు అన్నారు.
పట్టణానికి దూరంగా ఉండటం వల్ల చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కానీ పట్టణంలో ఉన్నటువంటి ఆసుపత్రికి రావాలి అంటే ప్రత్యేకమైన వాహనం మాట్లాడుకుని రావాల్సిన పరిస్థితి ఉంటుందని, అందువలన అక్కడ ఎమర్జెన్సీ సెంటరును ఏర్పాటుచేసి ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు.