ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చంద శ్రీనివాస్

Spread the love

ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చంద శ్రీనివాస్

సాక్షిత సైదాపూర్ మండలం కరీంనగర్ జిల్లా

సైదాపూర్ మండల కేంద్రంలోని
,గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత వైద్య సిబ్బంది దేనని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్ష ,కార్యదర్శి చందా శ్రీనివాస్, కాయిత రామలు సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా గర్భిణీలకు,సామాన్య రోగులకు పండ్లును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్ని రకాల చికిత్సల కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలోని సౌకర్యాలను రోగులకు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికి పోకూడదని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రజలు వైద్యం చేయించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో భాగంగానే కెసిఆర్ కిట్టును, ఆడపిల్ల పుడితే 13 వేలు, మగ పిల్లవాడు పుడితే 12 వేల రూపాయలను ఫిక్స్ డిపాజిట్ చేస్తుందని,వృద్ధులకు కంటి వెలుగుతో పాటు తదితర పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజలకు ఆరోగ్య సూత్రాలు తెలియజేయడంతో పాటు, జబ్బులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించేలా చూడాలని అన్నారు. అనంతరం గర్భిణీలకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీనివాస్, అరుణ్, సుస్మిత, సర్పంచ్ కొండ గణేష్, సూపర్వైజర్ సమ్మయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ సామ్రాజ్యం, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, అంగన్వాడి టీచర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page

Compare