0 0
Spread the love

Read Time:4 Minute, 0 Second

రెవెన్యూ శాఖలో మరో అవినీతి చేప ACB వలకు చిక్కింది. ఇన్నాళ్లు వీఆర్వోలు, ఇతర సిబ్బంది పట్టుబడ్డారు.ఇప్పుడు తాజాగా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు ఓతహసీల్దారు… బాణాల నాగభూషణరావు టెక్కలి తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పక్కా వ్యూహంతో టెక్కలిలోనే తహసీల్దారు అద్దెకుంటున్న ఇంట్లోనే రాత్రివేళ మాటు వేసి పట్టుకున్నారని డీఎస్పీ వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే గూడెం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, వైకాపా నేత గుజ్జు వెంకటరెడ్డి ఫిర్యాదుతో ACB అధికారులు రంగంలోకి దిగారు.
ACB అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం బాధితుడు వెంకటరెడ్డికి టెక్కలి చిన్నబజారు కూడలిలో ఓ దుకాణ సముదాయం ఉంది. దాన్ని కూల్చివేయమని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చేశాయని తహసీల్దార్‌ గత కొన్నిరోజులుగా బాధితుడిని బెదిరిస్తూ వచ్చారని తర్వాత ఇది కూల్చకుండా ఉండేందుకు, పొజిషన్‌ సర్టిఫికెట్‌ మంజూరుకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు ACB అధికారులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి దిగారు. ప్రణాళిక ప్రకారం.. పొజిషన్‌ సర్టిఫికెట్‌ కోసమని రూ.4 లక్షలు లంచం ఇస్తుండగా అక్కడే ఉన్న అధికారులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ నివాసంలో సోదాలు చేయగా, అదనంగా రూ.1.15 లక్షలు లభించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నాగభూషణరావుపై కేసు నమోదు చేశామని, శనివారం విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. ఈ దాడిలో ఏసీబీ సిబ్బంది సీఐ బి.హరి, ఎస్సైలు చిన్నంనాయుడు, సత్యారావు, సిబ్బంది పాల్గొన్నారు.

నాగభూషణరావు ఫ్రొఫైల్… విజవల్స్ తో వాడగలరు…

నాగభూషణరావుకు ఇది కొత్తేమీ కాదు..గతంలో 2010లో పాతపట్నం ఉప తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో రూ.11 వేలు లంచం తీసుకుంటూ అప్పట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. తాజాగా మరోసారి టెక్కలిలో చిక్కారు. అయితే ఇంత పెద్దమొత్తం సొమ్ముతో పట్టుబడటం స్థానికంగా సంచలనం రేపింది. నాగభూషణరావు తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2003లో ఎన్టీఆర్‌ నగర్‌ పట్టాలు జారీ చేసిన సమయంలో ఇక్కడే ఆర్‌ఐగా పనిచేశారు. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు అక్కడ పట్టాల వ్యవహారంపై విచారణ పేరిట అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఖాళీగా కనిపించిన స్థలాలను కొన్నిచోట్ల కొందరికి అప్పగించగా, మరికొన్ని చోట్ల పాత పట్టాదారుల నుంచి రద్దు చేసేస్తానని బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు దిగినట్లు తెలుస్తోంది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Print Friendly, PDF & Email

Spread the love

You cannot copy content of this page