Read Time:54 Second
జీడిమెట్ల డివిజన్ లో టీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ కు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కుల్దీప్ సింగ్ రాథోడ్ ఇటీవలే అస్వస్థతకు గురికావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో 129 డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు ఎత్తరి మారయ్య, శ్రీకాంత్, కాలే నాగేష్, రాజు యాదవ్, సందీప్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

