SAKSHITHA NEWS

హాల్ టికెట్లు పేరుతో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ నారాయణ కాలేజీ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ఫీజుల కోసం హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులని ఇబ్బంది పెడుతున్న కార్పొరేట్ నారాయణ మరియు ఇతర ప్రైవేట్ కాలేజీ లపై చర్యలు తీసుకోవాలని పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డిఐఈఓ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పి.డిఎ.స్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్రారంభం అయ్యే నేపథ్యంలో ఇదే అదనుగా చూసి కార్పోరేట్ నారాయణ మరియు ఇతర ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వడం లేదని, దీని కారణంగా అనేక మంది విద్యార్థులు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ఇలాంటి కళాశాల పైన అధికారులు కఠినంగా చర్యలు తీసుకొని, ఇంటర్మీడియట్ చదువుతున్నా ప్రతి విద్యార్థికి కాలేజ్ ఫీజ్ తో సంబంధం లేకుండా హాల్ టికెట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేని మూలంగానే విద్యార్థులు ఇలాంటి నమస్యలను ఎదుర్కొంటున్నారని తక్షణమే ప్రభుత్వం మొత్తం బకాయిలను చెల్లించాలని కోరారు.

రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా కళాశాల యాజమాన్యాల కారణంగా పరీక్ష రాయకపోయినా మానసిక ఇబ్బందులకు గురైన ఎలాంటి చర్యలకు పాల్పడిన ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఇంటర్మీడియట్ బోర్డ్ పైన ఉందని వారు అన్నారు. ఈ విషయం పైన ప్రభుత్వం స్పందించక పోతే పి.డి.ఎస్.యు ఉద్యమం చేపడుతుంది అని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు, మహేష్,నవీన్,పవన్, వినయ్,రాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app