
మున్సిపల్ కాలువలపై దుకాణాల అక్రమ నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్ కు బీసీఎఫ్ ఫిర్యాదు
సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తాలో మున్సిపల్ మురుగు కాలువలపై అక్రమంగా అక్రమించి నిర్మించిన దుకాణాలను వెంటనే కూల్చివేయాలని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ఫుట్పాత్ ఏర్పాటు చేసి కాలినడకన వెళ్లే పాదాచారులకు సౌకర్యం కల్పించాలని , దీనివల్ల ట్రాఫిక్ సమస్య తో పాటు యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయని ఈ ప్రాంతంలో హాస్పిటల్స్ ఉండటం వల్ల అనారోగ్యంతో వచ్చిన రోగులకు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని ఒక్కొక్కసారి తీవ్ర అనారోగ్యంతో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పేషెంట్లు జిల్లా ఆస్పత్రికి వెళ్లాలన్నా లేదా హైదరాబాదుకు వెళ్లాలన్న కర్నూలుకు వెళ్లాలన్న ఈ రోడ్డు గుండానే వెళ్లాల్సి వచ్చినప్పుడు పేషెంట్లు ఒక్కొక్కసారి మధ్యలోనే చనిపోయేటువంటి దుస్థితి ఏర్పడుతుంది కాబట్టి భవిష్యత్ తరాలకు గాని ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలంటే వెంటనే ఈ షాపులను కుల్చివేసి మున్సిపల్ చట్టాల ప్రకారం చర్యలు చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ ఆధ్వర్యంలో బీసీ ఫెడరేషన్ బృందం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది
దీనిపై కలెక్టర్ ఆదర్శ సురభి స్పందిస్తూ వెంటనే విచారణ చేపడతామని సదరు స్థలాన్ని పరిశీలిస్తామని తప్పు చేసిన వారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించిన ఎలాంటి చర్య ఇప్పటివరకు తీసుకోలేదు కాబట్టి కలెక్టర్ చొరవ తీసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం ఈ అంశంపై పత్రికా విలేకరులు సమావేశంలో చెన్న రాములు మాట్లాడుతూ పై విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి సి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు కే వెంకటేశ్వర్లు అమడబాకుల రామన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ ఏర్పుల తిరుపతి యాదవ్ బీసీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి తిరుపతయ్య యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్ బాబు కొత్తకోట మండలం కార్యదర్శి దేవేందర్ గౌడ్ , బి సి ఎఫ్ వనపర్తి పట్టణ కార్మిక విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి మన్నెం వనపర్తి పట్టణ అభివృద్ధి సంఘం నాయకులు పుట్టపాకుల బాలు తదితరులు పాల్గొన్నారు.
