
రైతు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుంది : మాజీమంత్రి ప్రత్తిపాటి
తిమ్మాపురం గ్రామంలో రూ.2.30లక్షలతో నిర్మించిన మినీ గోకులం షెడ్లు ప్రారంభించిన పుల్లారావు
యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో రూ.2.30లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన మినీ గోకులం షెడ్లను మాజీమంత్రి ప్రత్తిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతుల తొలి పండుగ సంక్రాంతి అని, అటువంటి పండుగ వేళ అన్నదాతల లోగిళ్లు కళకళలాడాలనే సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుందని.. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా, పుట్టిన ఊరిని, కన్నతల్లిని, అన్నంపెట్టే అన్నదాతను ఎప్పటికీ మరువకూడదని పుల్లారావు తెలిపారు. గోకులం షెడ్లను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే ప్రభుత్వ ఆలోచనలు సఫలీకృతం అవుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో, టిడిపి నాయకులు కామినేని సాయి బాబు, పావులూరి శ్రీనివాసరావు, పావులూరి పిచ్చయ్య టీడీపీ నాయకులు, కార్యకర్తలు తడితలూరున్నారు
