నేను ఎవరికీ పోటీ కాదు నిరుపేదలకు సేవ చేయడంలో పోటీ పడతా.

Spread the love

I do not compete with anyone but compete in serving the poor.

నేను ఎవరికీ పోటీ కాదు నిరుపేదలకు సేవ చేయడంలో పోటీ పడతా. ప్రాణం ఉన్నంతవరకు పేదలకు సేవ చేస్తూనే ఉంటా: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

( సాక్షిత ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి తన ప్రాణం ఉన్నంతవరకు బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని విలేకరుల సమావేశంలో తెలియజేశారు.

విద్య వైద్యం ఉపాధి పేదలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని, కల్వకుర్తి నియోజకవర్గం లోని నిరుపేద ప్రజల కోసమే తాను శ్రమిస్తానని, నియోజకవర్గంలోని ఎక్కడ ఏ మనిషికి ఆపద వచ్చిన క్షణాల్లో ఆదుకుంటానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు

. ఆమనగల్లు లో ఐక్యత ఫౌండేషన్ ఆఫీసును ఏర్పాటు చేశానని పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజల కష్టాలు తీరుస్తానని రాఘవేందర్ రెడ్డి అన్నారు. ప్రతినిత్యం పేద ప్రజల బాగోగులు చూసుకోవడమే, పేద ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను కూడా తనకు అవకాశం ఇస్తే ప్రభుత్వ పాలన అధికారిగా కూడా అందిస్తానని సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పాఠశాలలకు కావలసిన సామాగ్రి అందించడమే తన లక్ష్యమని, ఐక్యత ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాము అని, సామాగ్రి అందించడంతోపాటు నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసం తాను కృషి చేస్తున్నానని అన్నారు.

అనారోగ్యం బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకోవడానికి స్తోమత లేని పేద ప్రజలకు తన ఐక్యత ఫౌండేషన్ ద్వారా వైద్యం అందేలా చేస్తున్నానని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే తన లక్ష్యమని, కల్వకుర్తి నియోజకవర్గం లోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు

. తాను అమెరికా నుంచి పురిటిగడ్డకు వచ్చింది కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి అని, తన ఊపిరి ఉన్నంతవరకు పేద ప్రజల అభ్యున్నతికే పాటు పడతానని, రైతును రాజును చేయడమే తన లక్ష్యమని కల్వకుర్తి నియోజకవర్గం లోని ఏ ఒక్క నిరుపేద రైతుకు, నిరుపేద కుటుంబానికి,

అన్యాయం జరగనివ్వనని, అందరినీ ఆదుకోవడానికి తానున్నానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లోని ఏ ఒక్కరు అనారోగ్యం పాడిన పడిన, యాక్సిడెంట్లో కాలు చేతులు కోల్పోయిన, గ్రామాలలో, పట్టణాలలో ఏ ఒక్కరూ చనిపోయిన ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్నామని సింగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు.

Related Posts

You cannot copy content of this page

Compare