హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ విమానాశ్రయం) విస్తరణ

Spread the love


Hyderabad Metro Rail Phase II (Mind Space to Shamshabad Airport) expansion

సాక్షిత : హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ విమానాశ్రయం) విస్తరణకు డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసిఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో కొండాపూర్ డివిజన్ పరిధిలోని మైండ్ స్పేస్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద మైండ్ స్పేస్ స్థలాన్ని మంత్రులు మహ్మద్ అలీ ,

తలసాని శ్రీనివాస్ యాదవ్ , శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ , కాలే యాదయ్య , మెట్రో ఎండీ NVS రెడ్డి , సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర , మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ,మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు,ట్రాఫిక్ ఏసీపీ హన్మంత రావు తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందని, మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఈ కారిడార్ ను స్వంత ఖర్చులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది

అని, పెరుగుతున్న జనవాసాలకు, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఈ మెట్రో కారిడార్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అని, ఐటీ ఉద్యోగులకు, విమానాశ్రయం వెళ్లే వెళ్లే వారికి, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు మరియు శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని,

ట్రాఫిక్ ఉపశమనం లభిస్తుందిఅని, ఇంతటి కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అని, శంకుస్థాపన చేసే మైండ్ స్పేస్ ప్రాంతంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సమావేశ ప్రాంగణం అప్ప జంక్షన్ వంటి వాటి ఏర్పాట్లను పరిశీలించమని అదేవిధంగా


హైదరాబాద్ నగరానికి ఈ ప్రాజెక్ట్ తలమానికంగా మారుతుంది అని, అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఇది మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ సిఐ తిరుపతి, రాయదుర్గం సిఐ మహేష్ మరియు మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page