
తాను నమ్మిన ధర్మాన్ని పాటిస్తూనే ఇతర మతాల పట్ల లౌకికతత్వాన్ని చాటిన మహారాజు చత్రపతి శివాజీ : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన చత్రపతి శివాజీ 395వ జయంతి కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. తాను నమ్మిన ధర్మాన్ని ప్రేమిస్తూనే ఇతర మతాల పట్ల లౌకిక తత్వాన్ని చాటుతూ మొగలులపై వీర పరాక్రమాన్ని చాటిన గొప్ప పరాక్రమవంతుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు.
జయదర్శిని ఎన్క్లేవ్ నందు…
కొంపల్లి మున్సిపాలిటీ పరిధి జయదర్శిని ఎంక్లేవ్ నందు నిర్వహించిన చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొండల్ రావు, ఉపాధ్యక్షులు ఏ. ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి మహేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి చిన్నారెడ్డి, కోశాధికారి కృష్ణ కిషోర్, ఇతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పోచమ్మ గడ్డ వద్ద…
పోచమ్మ గడ్డ వద్ద నిర్వహించిన చత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శివాజీ సేన సభ్యులు విష్ణు, శివ, గోపి మైలర్, సాంబ, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సువర్ణ కృష్ణసాగర్, జంధా మంజుల కుమార్, నాయకులు లక్ష్మణ్ గౌడ్, సన్న రాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app