పేద‌లకు గౌర‌వ ప్ర‌దం ఆస‌రా పెన్ష‌న్లు

Spread the love

honorary-pensions-for-the-poor

పేద‌లకు గౌర‌వ ప్ర‌దం ఆస‌రా పెన్ష‌న్లు

వ‌యో ప‌రిమితి త‌గ్గించ‌డంతో 10 ల‌క్ష‌ల మందికి కొత్త‌గా అవ‌కాశం

దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒంట‌రి మ‌హిళ‌లు, దీర్ఘ‌కాలిక రోగుల‌కు కూడా పెన్ష‌న్లు

మాన‌వ‌త్వం ఉన్న మ‌న ప్ర‌భుత్వం సిఎం కెసిఆర్ ప్ర‌భుత్వం

రోజంతా జ‌నంతోనే… జ‌నంలోనే….!

కొత్త ల‌బ్ధిదారుల‌తోనే టీ, టిఫిన్‌, భోజ‌నాలు

ఊరూరా, ఇంటింటికీ కొత్త ఆస‌రా పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్న రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
సాక్షిత మహబూబాబాద్ (పాలకుర్తి నియోజకవర్గం-తొర్రూరు), :

పేద‌లకు గౌర‌వ ప్ర‌దమైన జీవితాన్ని అందించేందుకే ఆస‌రా పెన్ష‌న్లు ఇస్తున్నామ‌ని, సి.ఎం. కెసిఆర్ చొర‌వ‌తో 57 ఏండ్ల‌కు వ‌యో ప‌రిమితి త‌గ్గించ‌డంతో మ‌రో 10 ల‌క్ష‌ల మందికి కొత్త‌గా అవ‌కాశం వ‌చ్చింద‌ని, కొత్త‌వాటితో క‌లుపుకుని ఇప్పుడు ఆస‌రా పెన్ష‌న్లు దాదాపు అర‌కోటికి చేరాయ‌ని, రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. దేశ వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగుల‌కు మాత్ర‌మే పెన్ష‌న్లు ఇస్తుంటే, దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒంట‌రి మ‌హిళ‌లు, దీర్ఘ‌కాలిక రోగుల‌కు కూడా పెన్ష‌న్లు ఇస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం, సిఎం కెసిఆర్ త‌మ మాన‌వ‌తా దృక్ప‌థాన్ని చాటుకున్నార‌ని మంత్రి అన్నారు. కెసిఆర్ ప్ర‌భుత్వం మాన‌వ‌త్వం ఉన్న మ‌న ప్ర‌భుత్వం సిఎం కెసిఆర్ ప్ర‌భుత్వమ‌ని మంత్రి వివ‌రించారు.

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని ఊరూరా, ఇంటింటికీ కొత్త ఆస‌రా పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్న మంత్రి, రోజంతా జ‌నంతోనే… జ‌నంలోనే….! గ‌డుపుతున్నారు. కొత్త ల‌బ్ధిదారుల‌తోనే టీ, టిఫిన్‌, స‌హ‌పంక్తి భోజ‌నాలు చేస్తున్నారు.

బుధ‌వారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామంలో నాంచారి మడూరు, గుడి బండ తండా ల గ్రామాలకు, అమ్మాపురంలో అమ్మాపురం, జి.కె.తండా ఖానాపురం, గుర్తూరులో, సోమారంలో సోమారం, జ‌మ‌స్తాన్ పూర్ గ్రామాల‌కు, హ‌రిపిరాల‌లో హ‌రిపిరాల‌, దుబ్బ‌తండ‌, అమ‌ర్ సింగ్ తండా, క‌ర్కాల‌, వెంక‌టాపురం గ్రామాల‌కు, కంఠాయపాలెంలో, మ‌డిప‌ల్లెలో మ‌డిప‌ల్లె, ఎస్‌వికె తండా, మాటేడులో మాటేడు, పోలేప‌ల్లి, ఫ‌తేపురం, చింత‌ప‌ల్లిలో చింత‌ల‌ప‌ల్లి, కొమ్మ‌న‌ప‌ల్లి, అచ్చుతండా గ్రామాల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కొత్త పెన్ష‌న్ల‌ను పంపిణీ చేశారు

.

ఈ సందర్భంగా గ్రామ గ్రామాన ప్ర‌జ‌లు మంత్రికి పూలు చల్లుతూ, మేళ తాళాలతో, కోలాటాల తో, బతుకమ్మలతో, తెలంగాణ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల్లో మంత్రి ఎర్రబెల్లి కి ఘనంగా స్వాగతం పలికారు

అనంత‌రం ఆయా గ్రామాల్లో జ‌రిగిన స‌భ‌ల్లో మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, పేద‌ల‌కు గౌర‌వ ప్ర‌దంతోపాటు భ‌ద్ర‌త‌తో కూడిన జీవితాన్ని ఇవ్వాల‌ని సిఎం భావించార‌న్నారు. అందుకే కేవ‌లం 70 రూపాయ‌ల‌తో మొద‌లై 200 రూపాయ‌ల ద‌గ్గ‌ర ఆగిన పెన్ష‌న్ల‌ను 2016, 3016 రూపాయ‌ల వ‌ర‌కు పెంచార‌ని చెప్పారు. ఇంత పెద్ద మొత్తం పెన్ష‌న్ గా ఇస్తున్న రాష్ట్రాలు కూడా దేశంలో లేవేన్నారు. గ‌త ఏడాది వ‌ర‌కు ఏడాదికి 12వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌గా, ఈ ఏడాదికి 2,500 కోట్ల బ‌డ్జెట్‌ను భ‌రిస్తూ ఇస్తున్నార‌న్నారు. పెన్ష‌న్ల‌లో 69శాతం మ‌హిళ‌లే ఉన్నార‌ని చెప్పారు. సామాజిక వ‌ర్గాల వారీగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలే అధికంగా ఉన్నార‌ని మంత్రి వివ‌రించారు.

దేశంలో పెన్షన్లు వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రమే ఇస్తున్నారు. కానీ, మన రాష్ట్రంలో బీడీ కార్మికులకు, వితంతువులకు, HIV, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలిసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్న మహానుభావుడు కెసిఆర్‌. మ‌నమంతా సీఎం కెసిఆర్ కి రుణపడి ఉండాలి. మన సీఎం కెసిఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు. సాగునీరు, పంట‌ల పెట్టుబ‌డులు, పంట రుణాలు, రుణ విముక్తి, రైతు బీమా, క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్‌, కెసిఆర్ కిట్ వంటి అనేక ప‌థ‌కాల‌ను మంత్రి ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

Related Posts

You cannot copy content of this page