SAKSHITHA NEWS

గుంటపల్లి దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో హోంశాఖ మంత్రి అనిత…

సాక్షిత : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామంలోపర్యటించిన ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.తాను ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం లోని జనసేన నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో అనిత కు కూటమి శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు

.వంగలపూడి అనిత గుంటపల్లి లోని దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు.జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళ లతో కలిసి కాసేపు ముచ్చటించారు. టిడిపి , బిజెపి, జనసేన పార్టీలకు శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.


SAKSHITHA NEWS