ఆర్జీవీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
చంద్రబాబు, పవన్, లోకేశ్ పై అసభ్యకర పోస్టులు చేశారనే ఆరోపణలతో ఆర్జీవీపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.
వీటిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
గతంలో ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది.