SAKSHITHA NEWS

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ..

దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్‌ అని.. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఎల్లప్పుడూ ఓటర్లు ఓటు వేయాలని తెలిపారు.

భారత రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల చట్టాలు, నియమాలు అందులో జారీ చేసిన సూచనల ప్రకారం, భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లతో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app