SAKSHITHA NEWS

గురువులు భవిష్యత్తు మార్గదర్శకులు..
నీలం మధు ముదిరాజ్..
చిట్కుల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు..
సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు..
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులను సన్మానించిన నీలం మధు ముదిరాజ్

గురువులు విద్యార్థుల భవిష్యత్తు మార్గదర్శకులని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
టీచర్స్ డే ని పురస్కరించుకొని చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు గురువులు చేసే సహకారం వెలకట్టలేనిది అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క దశలో గురువులు మార్గదర్శకులుగా ఉంటారని తెలిపారు. బాల్యంలో తల్లిదండ్రులు, పాఠశాలలో టీచర్లు, ఉద్యోగ సమయంలో పై అధికారులు, రాజకీయంలో తమకు నచ్చిన మెచ్చిన నాయకులను గురువుగా భావిస్తారన్నారు. తమ శిష్యులు ప్రయోజకులై జీవితంలో స్థిరపడితే గురువులకు అంతకు మించిన సంతోషమెది ఉండదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గురువుల మాట తూచా తప్పకుండా పాటిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు, ఆ తర్వాత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన నీలం మధు ముదిరాజ్, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్,వి నారాయణ రెడ్డి, మాజీ సభ్యులు వెంకటేశ్,మురళీ,రాజ్ కుమార్,కృష్ణ, శ్రీను,అనిల్,తది తరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS