గుర్రం జాషువా జయంతి వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Spread the love

Joshua Jayanti celebrations participated Mr. Dr. Gopireddy Srinivasa Reddy

గుర్రం జాషువా జయంతి వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

సాక్షిత : జాతీయోద్యమ కాలంలో జాతి జనుల్లో భారతమాత గొప్పతనాన్ని చాటి చెప్పే అనేక విషయాలను తన కవిత్వంలో పొందుపరచిన మహనీయులు గుర్రం జాషువా గారని కొనియాడారు శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి … గుర్రం జాషువా జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డులో గల గుర్రం జాషువా విగ్రహానికి జిల్లా కలెక్టర్ శివ శంకర్ తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు*

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సమాజంలో వివక్షతను, అసమనాతలను తన కవిత్వం ద్వారా గుర్రం జాషువా ఎత్తిచూపారని, ఆయన సాహిత్యం సమకాలీన సమాజంలో ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు. పేదరికం, అవమానాలతో కుంగిపోక ధీరోదాత్తునిలా ఎదుర్కొని విశ్వనరుడి స్థాయికి ఎదిగాడు. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తినొందాడు. తెలుగుదనాన్ని తన పద్యంలో జాలువార్చి స్వచ్ఛమైన తెలుగుభాషకు ప్రాణప్రతిష్ఠ చేశారన్నారు. అటు సంప్రదాయ సాహిత్య సంస్కారాన్నీ, ఇటు ఆధుని కతనూ మేళవించి తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిం చాడు. కావుననే జాషువా పద్యం జానపదుల నాలుకలపై జీవించి వుంది. ఇంతటి ప్రాచుర్యం పొందిన కవి తెలుగు భాషలో అరుదని కొనియాడారు.

Related Posts

You cannot copy content of this page