గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలి.

Spread the love

గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలి.

జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. ‘‘గ్రీవెన్స్‌ డే’’ ను పురస్కరించుకుని ఐడిఓసి లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ఆదేశాలిస్తూ, ఆయా శాఖాధికారులకు కలెక్టర్ ఫార్వార్డ్ చేశారు.


ఈ సందర్భంగా సత్తుపల్లి మండలం బెతుపల్లి-గంగారాం మత్స్య పారిశ్రామిక సహకార సంఘ కమిటీ సభ్యులు తమకు బెతుపల్లి చెరువులో చేపలు పట్టుకొనుటకు అనుమతికై కోరగా, జిల్లా మత్స్య శాఖ అధికారిని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. సింగరేణి మండలం పేరుపల్లి సూర్యతాండ కు చెందిన సిహెచ్. హచ్చి తాను వికలాంగురాలినని, ఆసరా పెన్షన్ మంజూరుకు కోరగా, డిఆర్డీవో కు తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామం నుండి జి. వెంకటేశ్వర్లు తాను సర్వే నెం. 64 లో 2 ఎకరాల భూమికి సంబంధించి ధరణి మిస్సింగ్ సర్వే నెంబర్ కొరకు అప్లై చెందిన దరఖాస్తు తొలగింపుకు దరఖాస్తు చేయగా, ధరణి కోఆర్డినేటర్ ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. వైరా గ్రామం నుండి కాసిమల్ల జ్యోతి, తనకు రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు లేవని, తన బాబుకు గుండెలో రంధ్రాలు ఉన్నట్లు, చికిత్స భరించే స్థోమత లేదని ధ్రువీకరణ కు కోరగా, జిల్లా రెవిన్యూ అధికారిని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. స్థానిక రోటరీ నగర్ నుండి అమృతం సూర్యకాంతమ్మ తమకు మంజూరయిన స్వాతంత్ర్య సమరయోధుల కోటా భూమిని ఇప్పించగలందులకు కోరగా, తహసీల్దార్ రఘునాథపాలెం ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. కొణిజేర్ల నుండి ఎస్. ఉమాదేవి, తనకు వివాహం అయి 12 సంవత్సరాలు అయినాయని, రేషన్ కార్డులో పేరు చేర్చుటకు కోరగా, జిల్లా పౌరసరఫరాల అధికారిని తగుచర్యకై ఆయన ఆదేశించారు. మధిర మండలం మాటూరుపేట గ్రామం నుండి ఆర్. దాసు, తనకు చెందిన సర్వే నెం. 705/అ లో 0.30 కుంటల భూమి పాస్ బుక్ డాటా సవరింపుకు దరఖాస్తు చేయగా, తహసీల్దార్ కు తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. కొణిజేర్ల మండలం ఎల్లన్ననగర్ గ్రామవాసులు పోడు భూముల సర్వే గురించి దరఖాస్తు చేయగా, జిల్లా అటవీ శాఖ అధికారికి తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. మధిర మండలం రొంపిమళ్ల జాలిముడి ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు జాలిముడి ప్రాజెక్ట్ కాల్వలో పిచ్చి చెట్లు, పొదలు తొలగించి శుభ్రం చేయించుటకు దరఖాస్తు చేయగా, జిల్లా నీటిపారుదల శాఖ అధికారిని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. వైరా పట్టణ 20వ వార్డ్ కౌన్సిలర్ గుగులోతు లక్ష్మీబాయి, 8వ వార్డ్ కౌన్సిలర్ కన్నెగంటి సునీత లు తమ వార్డుల్లో డ్రైన్లు, సిసి రోడ్లు, వైకుంఠ దామాల కొరకు నిధుల మంజూరుకు కోరగా, పీఆర్ ఇఇ ని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. స్థానిక మామిళ్లగూడెం నుండి బి. శ్రీదేవి తనకు ఉద్యోగం ఇప్పించగలందులకు దరఖాస్తు చేయగా, జిల్లా సంక్షేమ అధికారిని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page