భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్ కు మధ్య ఎదురు కాల్పులు ఆరుగురు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెం పంచాయితీ పరిధిలోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు జరగగా.. లచ్చన్నతో సహా దళ సభ్యులు మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్ కానిస్టేబుల్స్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మణుగూరు నుండి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన లచ్చన్న నాయకత్వంలో ఈ దళం సంచరిస్తోంది.