గ్రీన్ఇండియా చాలెంజ్
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తన జన్మదినం పురస్కరించుకొని శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధానం , శ్రీ శైలం లో మొక్కలు నాటిన దంపతులు బోయినిపల్లి మాధవి -వినోద్ కుమార్ ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ ..
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారానికి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేప్పట్టి మొక్కలు నాటే విదంగా అందరిలో చైతన్యం కలిగిస్తున్నారు . ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వృక్ష సంపదను పెంచాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు .వారితో పాటు కుటుంబ సభ్యులు , కార్యకర్తలు అభిమానులు , ప్రముఖులు పాల్గొన్నారు
