SAKSHITHA NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ….

పట్టభద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉందని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమన్న ఎమ్మెల్యే నాగరాజు …

నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలోని ప్రవేట్ టీచర్లతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ అధ్యక్షతన మెదక్ – నిజామాబాద్ -కరీంనగర్ – ఆదిలాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారికి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విస్తుత ప్రచారం నిర్వహిస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి బాల్కొండ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ కేఆర్ నాగరాజు ….

అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ:-…

ప్రైవేట్ టీచర్ల సమస్యలు నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మీ ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాడు. ఒక విద్యావంతునిగా తనకు ఉపాధ్యాయుల మీద వారి కష్టసుఖాల మీద వారి సమస్యల మీద ఒక అవగాహన ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తికి కాబట్టి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డి కి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాడన్నారు…

గడిచిన పదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందించలేని పరిస్థితి …

ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీకి జీతాలు ఇవ్వడం మన ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం…

ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు ఆత్మగౌరవం కల్పించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నాం…

చరిత్రలో నిలిచిపోయేలా సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని బిల్లును ప్రవేశపెట్టారు….

ఇది మాకు విద్యార్థుల పట్ల,విద్యా విధానం పట్ల మాకు ఉన్న చిత్త శుద్ధి అని అన్నారు….

బీసీ,ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు అసౌకర్యాలు లేకుండా చూడాలని డైట్ ఛార్జ్ లు పెంచిన ఘనత ఈ ప్రభుత్వంది…

ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకోవాలని దావోస్ వేదికగా సీఎం పెట్టుబడుల కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు….

ఈ ఎన్నిక రాజకీయం కోసం కాదు….

ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి అండగా ఉండేలా కృషి చేసే అవకాశం కోసం జరుగుతున్న ఎన్నిక…

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app