Read Time:1 Minute, 42 Second
ప్రమాదంలో గాయపడిన గోవిందు చంద్రకళ ను పరామర్శ
సాక్షిత: కొహెడ
సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలో ప్రమాదవశాత్తు గాయపడిన బీసీ జనా సేన రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు సురేష్ తల్లిగారిని పరామర్శించిన
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు కోహెడ మండల్ కేంద్రానికి చెందిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకుడు, బీసీ జన సేన రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు సురేష్ నేత తల్లి ,(మాతృమూర్తి) గోవిందు చంద్రకళ గత నాలుగు రోజుల క్రితం ప్రమాద వశాత్తూ కాలు జారీ పడి తీవ్రమైన గాయంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మను ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు వారిని పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్యం గురించి డాక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారు పూర్తి ఆయురారోగ్యాలతో తిరిగి కోలుకోవాలని భగవంతుని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

