
చాడ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య . ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య రెడ్డి, వైస్ చైర్మన్ మదర్ గౌడ్,ఆర్డీవో కృష్ణ రెడ్డి , డిఆర్డిఓ నాగిరెడ్డి , సంబంధిత అధికారులు,చాడ గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియన్నారు.రాష్ట్రంలో 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఆరు లక్షల రేషన్ కార్డులు కట్ చేసి 40 వేల రేషన్ కార్డులు ఇచ్చారన్నారు.మన ప్రజా ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులను సరిజేసుకుంటూ అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామన్నారు.కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నామన్నారు.అదేవిధంగా గత సంవత్సర కాలంలో 20 రోజులు ఉపాధి హామీ పని చేసిన భూమిలేని నిరుపేదలు అందరికీ సంవత్సరానికి 12 వేల రూపాయలు,ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, ఇస్తామన్నారు.గుట్టలకు కొండలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కాకుండా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సంవత్సరానికి ఎకరానికి 12000 ఇవ్వబోతున్నాము.
మొదటి దశలో సొంత స్థలం కలిగి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలతోకట్టిస్తామన్నరు.ఈ నాలుగు రోజులపాటు జరిగే ప్రజా పాలన గ్రామసభలలోఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డుకి, ఇందిరమ్మ ఇండ్లకి దరఖాస్తు పెట్టుకుంటే వాటిని కూడా పరిశీలించి గుర్తిస్తామన్నారు.ఈ కార్యక్రమాలన్నీ నిరంతరంగా జరుగుతాయి ఈ జనవరి 26 కు కొంత మందికి మిగతా వారికి దశలవారీగా ఈ కార్యక్రమాలన్నీ అమలు చేయబోతున్నాం.ఎలక్షన్లో మాట ఇచ్చినట్టు 2 లక్షల వరకు రుణమాఫీని 22,000 కోట్లతో చేశామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అర్హులందరికీ అందిస్తున్నామని,మహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి ప్రతినెల 300 కోట్లు కడుతున్నాం.గ్యాస్ సిలిండర్లు 500 కే ఇస్తున్నామన్నారు.ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆశీస్సులతో ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నామన్నారు.
