SAKSHITHA NEWS

సెంట్రల్ నియోజకవర్గం లోని  CVR హై స్కూల్, చిట్టూరి హై స్కూల్, AKTP స్కూల్, మరియు MK బేగ్ స్కూల్ నందు కృష్ణా – గుంటూరు నియోజకవర్గాలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ సరళి ఏర్పాట్లను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  పరిశీలించడం జరిగింది..

ఈ సందర్భంగా బొండా ఉమా మీడియా తో మాట్లాడుతూ:-  పట్టభద్రులు ఓటు వేయడం మన బాధ్యత ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అని…

కూటమి కుటుంబ సభ్యులు ఓటర్లకు అందిస్తున్న సేవలను స్వయంగా బొండా ఉమ పరిశీలించారు, ఓటర్లకు వారి సీరియల్ నెంబరు, జాబితాలో క్రమసంఖ్య తదితర వివరాలను కూటమి కుటుంబ సభ్యులు ఓపిగ్గా వెతుకుతూ సేవలను అందిస్తున్నారు అని, నియోజకవర్గం లోని పోలింగ్ స్టేషన్ లలో  ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు వ్యవహరించాలన్నారు, పట్టభద్రులు వారి ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు,సెంట్రల్  నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని బొండా ఉమ తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో:-కడప RTC రీజనల్ ఛైర్మెన్ అబ్జర్వర్ పూల నాగరాజు, సెంట్రల్ నియోజకవర్గ అబ్జర్వర్ దేవ తోటి నాగరాజు, క్లస్టర్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు,క్లస్టర్ మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్,క్లస్టర్ దాసరి కనకారావు, తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app