SAKSHITHA NEWS

ప్రాథమిక హాస్పటల్ నిర్మాణానికి ప్రభుత్వ భూములను పరిశీలించిన ఎమ్మెల్యే పంచకర్ల….

సాక్షిత : విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం లో పంచకర్ల రమేష్ బాబు 93 వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనుల స్థల పరిశీలన కొరకు పర్యటించిన పెందుర్తిశాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. 93 వ వార్డు చుట్టుపక్కల పలు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రాథమిక ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్ నియమించాలని గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రమేష్ బాబును కార్పొరేటర్ కన్నా కోరారు.

93 వార్డు ప్రహ్లాదపురం శివాలయం వెనుక మరియు శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములలో ప్రాథమిక హాస్పిటల్ కొరకు మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టెందుకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. దీనిపై ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ గత ఎన్నికల్లో 93 వ వార్డు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

అదేవిధంగా వార్డు కార్పొరేటర్ కన్నా అడిగిన ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్ మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన,టీడీపీ, బిజెపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….


SAKSHITHA NEWS